INC: పాఠాలు నేర్వకుంటే మళ్లీ పరాభవమే..!
Congress: ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరొక రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చూపే ప్రత్యక్ష ప్రభావం నామమాత్రమే! కానీ, నేర్చుకోవడానికి పాఠాలు, గుణపాఠాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అవి నేర్వడానికి సిద్దంగా లేని పార్టీలు… చేసిన తప్పులే చేస్తూ ఉండొచ్చు, పడిన గోతిలోనే మళ్లీ మళ్లీ పడొచ్చు. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే! ఎక్కడో జరిగిన దాన్నుంచి పాఠం నేర్వనందునే హర్యానాలో ఆ పార్టీకి ఎదురైన క్షమార్హం కాని ప్రస్తుత ఓటమి. ఏతావాతా అన్ని…