National: డీలిమిటేషన్‌పై బీజేపీకి డీఎంకే మద్దతు.. కాంగ్రెస్‌తో మరింత దూరం!
National: Ravikumar✍🏽 దేశ రాజకీయాల్లో డీలిమిటేషన్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సవరణల బిల్లుపై తమిళనాడులో అధికార డీఎంకే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించేందుకు డీఎంకే మొగ్గు చూపడం రాజకీయంగా ఆసక్తికర పరిణామాలకు దారితీస్తోంది. ముఖ్యంగా గతంలో ఇండియా కూటమిలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసిన డీఎంకే ఇప్పుడు కాంగ్రెస్‌కు భిన్నమైన వైఖరి తీసుకోవడం ప్రతిపక్షాల మధ్య విభేదాలను మరింత…
