పెగాసస్ పై విచారణకు ప్రత్యేక కమిటీ_ సుప్రీం
దేశంలో పెగాసస్ నిఘా వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. పెగాసస్ వ్యవహారంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నిపుణుల కమిటీని నియమిస్తున్నట్లు తెలిపింది.చట్టబద్ధ పాలన సాగాలన్నదే తమ అభిమతం అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన సరికాదని, ఈ విషయాన్ని కోర్టు సహించదని స్పష్టం చేసింది. ఈ కేసులో కొందరు పిటిషనర్లు పెగాసస్ ప్రత్యక్ష…