Iran : చుట్టూ ఇనుప కంచెలున్న జైలు – ఒక పాత్రికేయుడి వ్యథ ✍️✍️
సాయి వంశీ ( విశీ) : (ఇరానియన్-కుర్దిష్ పాత్రికేయుడు, రచయిత Behrouz Boochani వివిధ సందర్భాల్లో చెప్పిన విషయాలను ఇక్కడ అనువదించాను). I’m a Child of War. అవును! నేను యుద్ధానికి పుట్టిన బిడ్డని. యుద్ధం, పేదరికం, కన్నీళ్లు, మరణాలు.. అన్నీ చూస్తూ పెరిగినవాణ్ని. కాసింత తిండి దొరకడాన్ని పండుగలా, కాసింత ఆశ్రయం దొరకడాన్ని వేడుకలా చూసినవాణ్ని. అనంతమైన ప్రేమ, అంతులేని ఆనందం కూడా నా జీవితంలో ఉంది. కానీ నేను వాటి గురించి చెప్పబోవడం…