2024 ఏపీ కింగ్ మేకర్ ఎవరు..? జనసేన రోల్ ఏంటి?
ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి రాష్ట్ర శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మూడింటికి మూడూ తెలుగుదేశం గెలుచుకోవడంతో, ఇక రాబోయే శాసనసభా ఎన్నికల్లో నాలుగు దిక్కులూ తమవేనని తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ గెలిచేస్తుందని ఆ పార్టీలోని సీనియర్ నాయకులు, ఆ పార్టీకి మద్దతిచ్చే మేధావులు ప్రచారం కూడా మొదలుపెట్టారు. కానీ, పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపును చూసి గెలుపనుకంటే అది వాపేగానీ, బలుపు కాదు….