వైసిపి 175 కాకపోతే 500 స్థానాల్లో పోటీ చేసుకోవచ్చు: నాదెండ్ల మనోహర్
ప్రతిపక్షాల జెండా.. అజెండా గురించి అతిగా ఆలోచించడం మానేసి ముఖ్యమంత్రి దమ్ము చూపుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు. 175 కాకపోతే 500 స్థానాల్లో పోటీ చేసుకోవాలనీ, ఓపిక ఉంటే పక్క రాష్ట్రాల్లోనూ పోటీ చేసుకోవచ్చని ఎద్దేవ చేశారు. ముఖ్యమంత్రికి దమ్ము లేదు కాబట్టే వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేసి ప్రభుత్వ కార్యక్రమాలో రాజకీయ కక్షలు రెచ్చేగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి అంశంలోకీ ఐ ప్యాక్ వాళ్ళని తీసుకువచ్చి…