Telangana: బంతి మోదీ కోర్టులో? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం?
Telangana: తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం అవినీతి కేసు హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ ప్రధాన నేత హరీష్ రావు పాలిట ఈ కేసు గుది బండలా మారుతుందని ఎవరూ ఊహించలేదు. మొదట్లో రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్ విచారణను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని ప్రకటించగానే కేసీఆర్, హరీష్ రావు అలర్ట్ అయ్యారు. హైకోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకోవాలనుకున్నారు. సీఐడీకి అప్పగించినా…