Jukkal: జర్నలిస్టు దత్తురెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
మద్దెల చెర్వు, జూలై 8: పత్రికా వర్గాల్లో నిబద్ధతతో, విలువలతో పనిచేసిన సీనియర్ జర్నలిస్టు జీడిపల్లి దత్తురెడ్డి అకాల మరణం జర్నలిస్టు సమాజాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. దత్తురెడ్డి గారి స్వగ్రామమైన మద్దెల చెర్వులో ఆయన నివాసానికి చేరుకున్న మంత్రి వెంకట్ రెడ్డి, దత్తురెడ్డి భార్య ప్రియాంకతోపాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. “దత్తురెడ్డి సేవలను మరువలేం. ఆయన కుటుంబానికి అండగా నిలవడం ప్రభుత్వ…