‘ఈనాడు’ కొత్త తెలుగు మాటలు కనిపెట్టే కంటే పాత తెలుగు పేర్లు నేర్పిస్తే మేలు!
Nancharaiah merugumala (senior journalist): గర్భ విచ్ఛిత్తికి బదులు ‘కడుపు తీయించుకోవడం’ అనే మాట వాడకూడదా? ––––––––––––––––––––––––––––––––––––––––––– గర్భ విచ్ఛిత్తి, గర్భస్రావానికి బదులు తెలుగునాట జన సామాన్యం వాడుక మాట– కడుపు తీయించుకోవడం– పత్రికల్లో, టీవీ చానళ్లలో వాడకూడదా? మమూలు మనుషులు పలికే ‘కడుపు తీయించుకోవడం’ అనే మాటలు అబార్షన్ లేదా గర్భస్రావం మాదిరిగానే పెళ్లయినవారికి, అవివాహితులకు కూడా వర్తించేలా వాడుకుంటున్నారు. సిజేరియన్ సెక్షన్ (సీఎస్) ఆపరేషన్ కు కత్తెర కాన్పు అని పెద్ద తెలుగు పత్రిక…