ఆలోచింపజేసే ‘ప్రయాణం ‘ కవిత్వం..
ప్రయాణించు.. లేకపోతే నువ్వొక జాత్యాహంకారిలా మారే ప్రమాదం ఉంది నీ వొంటి రంగే సిసలైనదని, నీ మాతృభాష మధురమైనది అని అన్నింటా నువ్వే ముందుండగలవని నమ్మే స్థాయికి దిగజారొచ్చు ప్రయాణించు.. ప్రయాణించకపోతే నీ ఆలోచనలు భావాలతో బలపడవు నీ ఆశయాలు పసలేని కాళ్ళతో పుడతాయి నువ్వు భయపడుతూ బతికేంత, పీడకలల్ని ఉత్పత్తి చేసే టీవీ షోలను నమ్మటం మొదలెడతావు ప్రయాణించు.. నువ్వు ఏ సూర్యుణ్ణించి వచ్చినా ఎదుటివారికి శుభోదయం చెప్పటం నేర్పుతుంది. నువ్వు లోపల ఎన్ని చీకట్లను…