INC: కాలంతో కాంగ్రెస్ కాలు కదిపితేనే…!
INC: కాంగ్రెస్ పునర్వైభవం, కాంగ్రెస్ కన్నా దేశానికి ఎక్కువ అవసరమనే ప్రజల ఆకాంక్షని పార్టీ నాయకత్వం గ్రహించినట్టుంది. కానీ, అదెలా జరగాలనే విషయంలో దానికొక స్పష్టత లేదని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) 86వ జాతీయ సమావేశ వేదిక వెల్లడి చేసింది. పాత విషయాల వల్లెవేతనే తప్ప… జాతికి నూతన ఆశలు కల్పించే, మిత్రపక్షాలకు కొత్త నమ్మిక ఏర్పరిచే, పార్టీ శ్రేణులకు తాజా ప్రేరణనిచ్చే అంశాలేవీ తీర్మానాల్లోకి రాలేదు. రాజ్యాంగ స్ఫూర్తి రక్ష, లౌకికవాద పరిరక్షణ,…