Telangana: బీసీలపై చర్చకు సిద్ధమా కవితకు టీపీసీసీ చీఫ్ మహేష్ సవాల్..!
INCTELANGANA: బీసీల అభివృద్ధి కోసం పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రకటన విడుదల చేశారు. కవిత ధర్నా చేపట్టబోయే ముందు తాను సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని సవాల్ విసిరారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో బీసీలను వంచించడమే కాకుండా.. వారికి న్యాయంగా అందాల్సిన నిధులను ఖర్చు చేయకుండా నిట్టనిలువునా ముంచిందన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత…