kavitha: తీహార్ జైలుకు ఫస్ట్ కవిత.. ఆమెకు సాటిరారు మరెవ్వరు..!!

kavitha: తీహార్ జైలుకు ఫస్ట్ కవిత.. ఆమెకు సాటిరారు మరెవ్వరు..!!

liquorscam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాజీ సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితకు రౌస్ రెవెన్యూ కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. మధ్యంతర బెయిల్  కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన కోర్టు  ఆమెకు ఏప్రిల్ 9 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది.   ఆమెను ఈడీ అధికారులు తీహార్ జైలుకు తరలించారు. దీంతో   తెలంగాణ ఏర్పడిన తర్వాత తీహార్ జైలుకు వెళ్లిన ఫస్ట్ పోలిటిషియన్ గా   ఎమ్మెల్సీ కవిత అంటూ రికార్టు స్రుష్టించందంటూ    సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో చాలామంది రాజకీయ నాయకులు వివిధ కేసుల్లో అరెస్టయినా రాష్ట్రంలోని జైళ్లలో కొన్ని రోజులు గడిపారు. కవితలాగా తీహార్ జైలుకు వెళ్లిన వారు లేరని.. ” ఆమెకు సాటిరారు మరెవ్వరు ” అంటూ  ఎద్దేవ చేస్తూ నెటిజన్స్ కామెంట్స్ జోడిస్తున్నారు.

ఇదిలా ఉంటే లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  కవిత సన్నిహితులు అరుణ్ రామచంద్రన్ పిళ్లై ,గోరంట్ల బుచ్చిబాబు, బొయిన్ పల్లి అశోక్ తో పాటు  పలువురు అరెస్టయి కొంతకాలం తీహార్ జైలులో గడిపారు.  కొద్దిమంది బెయిల్ పై బయటికొచ్చారు. ఇప్పుడు వారికి కొనసాగింపుగా కవిత జైలు జీవితం గడపనున్నారు. దీనికి తోడు ఇదే కేసులో  ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ నేతలు సంజయ్ సింగ్, సత్యేంద్రజైన్ తో తదితరులు ప్రస్తుతానికి తీహార్ జైలులోనే ఉన్నారు.