Nalgonda: లా విభాగంలో రామకృష్ణకు గోల్డ్ మెడల్..

నల్లగొండ: జిల్లాకు చెందిన రామకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది.  నేరేడుగొమ్ము మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ  హైదరాబాద్‌లోని బండ్లగూడ అరోరా లీగల్ సైన్సెస్ అకాడమీలో 2021 వ సంవత్సరంలో లా డిగ్రీ పూర్తిచేశాడు. బ్యాచ్ లో టాపర్ గా నిలిచాడు. ప్రస్తుతం అతను అడ్వకేట్ ప్రాక్టీసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో అరోరా   కళాశాల యాజమాన్యం శనివారం ఇండక్షన్ ప్రోగ్రామ్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా జస్టిస్ భీమపాక నగేష్ హాజరయ్యారు.  జస్టిస్ చేతుల మీదుగా లా…

Read More

మన తెలుగు పాటకిదే పట్టాభిషేకం..(స్వీయ రచన)

తెలుగు వెలుగు సాహిత్య వేదిక తేదీ 15-3-2023. అంశం, ప్రాసాక్షరి గీతం నననన,వవవవ,మిమిమిమి. శీర్షిక కీర్తి నిలుపు తెలుగు. మన తెలుగు పాటకిదే పట్టాభిషేకం జనపద జీవన లయల హర్షాతిరేకం పనస తొనల పలుకుల మధురగీతం ఘనతను సాధించేనేడు గానలహరి సంగీతం కవనమ్మున నాటుపదం పల్లవించినది నవరాగ సమ్మేళనం నాట్యమాడినది అవని లోని అణువణువు పులకరించినది జవసత్వముల తోడజగతికీర్తిపొందినది. సమిష్టి కృషి ఫలితమే ఈ ఆస్కారం తమిదీరని చలనచిత్ర మమకారం స్వామి దయతో వెండితెర వైభవవెలుగులు పంచాలి…

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా ప్రపంచ మహిళ దినోత్సవ వేడుకలు..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రపంచ మహిళ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లో రాణిస్తున్న  మహిళలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించి జ్ఞాపకలను అందజేశారు. పట్టణంలోని 32 వ వార్డులో కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి  చేతుల మీదుగా పారిశుధ్య కార్మికులకు చీరాల పంపిణి చేశారు. ప్రతి ఏటా మాదిరిగానే  స్వర్గీయ కోటగిరి చంద్రకళ జ్ఞాపకార్థం..Vc KCGF Nalgonda సహకారంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కోటగిరి రామకృష్ణ  తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

Read More

మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలి : ఎస్పీ అపూర్వ రావు

Nalgonda: అంతర్జాతీయ మహిళా దినోత్సవం  సందర్భంగా షి టీమ్ ఆధ్వర్యంలో 3.2కె రన్ నిర్వ‌హించారు. ఈకార్య‌క్ర‌మానికి ఎస్పీ అపూర్వ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాల‌ని కోరారు. ప్ర‌తిఏటా మహిళా దినోత్సవం సంద‌ర్భంగా.. మహిళలకు పట్టం కట్టే ఒక సరికొత్త థీమ్  మహిళల గొప్పతనాన్ని తేటతెల్లం చేస్తుందన్నారు.గతేడాది వివక్షను బద్దలు కొట్టి…

Read More

న‌ల్ల‌గొండ‌ బిఆర్ఎస్ లో ఎమ్మెల్సీ సీటు చిచ్చు.. పార్టీకి చ‌కిలం గుడ్ బై..!!

Nalgonda: న‌ల్ల‌గొండ బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ సీటు చిచ్చురేపింది. సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మ‌ల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో ..సీటు ఆశించి భంగ‌ప‌డ్డ‌ ప‌లువురు నేత‌లు పార్టీని వీడుతున్నారు. తాజాగా తెలంగాణ ఉద్య‌మ‌కారుడు చ‌కిలం అనిల్ కుమార్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు ఆశించిన ఆయ‌న ఎమ్మెల్సీ ద‌క్క‌క‌పోవ‌డంతో తీవ్ర మనస్థాపానికి గురై పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అనిల్ బాటలోనే మ‌రికొంత‌మంది నేత‌లు పార్టీని వీడే యోచ‌న‌లో ఉన్న‌ట్లు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం జ‌రుగుతుంది….

Read More

ర్యాగింగ్ చేస్తే ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ అమల్లో ఉంది: ఎస్పీ అపూర్వ రావు

నల్గొండ: కామినేని మెడికల్ కళాశాలలో ఈవ్ టీజింగ్,సోషల్ మీడియా,మాదక ద్రవ్యాలు ,యాంటీ ర్యాగింగ్ చట్టాలపై మెడికల్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ కె.అపూర్వ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో షీ టీమ్స్ బృందాలు బాగా పనిచేస్తున్నాయని కొనియాడారు. జన సమూహాలు .. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో..నిరంతరం పర్యవేక్షిస్తూ, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్…

Read More

Nalgonda: జిల్లావ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి: అపూర్వ‌రావు

న‌ల్ల‌గొండ : జిల్లా పోలీస్ కార్యాల‌యంలో సామాజిక‌భ‌ద్ర‌త‌పై వివిధ కంపెనీల పారిశ్రామిక వేత్త‌ల‌తో ఎస్పీ అపూర్వ‌రావు స‌మావేశం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక‌త‌.. నేర‌ర‌హిత నిర్మాణాంలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌న్నారు. పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణ‌యానికి (సిసి కెమెరాల ఏర్పాటు) స్వ‌చ్ఛదంగా వివిధ కంపెనీల పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో నేరాల నియంత్రణ‌, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పించడంలో సిసి కెమెరాలు ఉపయోగపడతాయ‌ని…

Read More

ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ : ఎస్పీ అపూర్వ రావు

నల్లగొండ: మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదని హెచ్చరించారు ఎస్పీ అపూర్వ రావు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి నెలలో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ లలో ఇప్పటి వరకు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 1188 మంది పట్టుబడ్డారని తెలిపారు. 453 మందిని కోర్టు లో హాజరుపరిచి.. 21 మందికి ఒక రోజు, 08 మందికి రెండు రోజులు, ఒక వ్యక్తికి మూడు…

Read More

Nalgonda: గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువతకు టూ టౌన్ సీఐ, ఎస్సై కౌన్సిలింగ్..

నల్లగొండ: పట్టణంలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన యువతకు పోలీస్ స్టేషన్లో టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ రెడ్డిలు యువకుల తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. పట్టుబడిన 9 మంది యువకుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. గంజాయి అమ్మినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.జిల్లా ఎస్పీ అపూర్వ రావు ఆదేశాల మేరకు పట్టణంలో గంజాయి విక్రయిదారులపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందన్నారు. పట్టణంలో ఎక్కడైనా యువకులు గంజాయి సేవిస్తున్నట్లు…

Read More

పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి: ఎస్పీ అపూర్వ రావు

నల్లగొండ: జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో ఎస్పీ అపూర్వ రావు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్.ఐ.లు పాల్గొన్నారు. అనంతరం పెండింగ్ కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. కేసుల సంఖ్య తగ్గించి..పరిష్కారానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అవసమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల సత్వర పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి…

Read More
Optimized by Optimole