literature: మన తెలుగు – మన వెలుగు.. పద్య నిర్మాణ కౌశలం..!
Teluguliterature: శా : ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు, కిం చిద్ర్దోహంబును నీకుఁజేయరు, బలోత్సేకంబుతోఁ జీకటిన్ భద్రాకారులఁ చిన్న పాపల రణప్రౌఢక్రియా హీనులన్ నిద్రాసక్తుల సంహరింప నకటా! నీ చేతులెట్లాడెనో? ప్రేగు తెంచుకు పుట్టిన బిడ్డలు… అదీ అన్నెం-పుణ్ణెమెరుగని చిన్నారులు… ఒకరో ఇద్దరో కాదు ఐదుగురిని, ఒక్కపెట్టున గొంతుకోసి సంహరిస్తే ఏ తల్తి గర్భశోకమైనా ఎలా ఉంటుంది? గుండెను పిడికిట పట్టి పిసికినట్టుండే ఆ తల్లి హృదయ వేదనను ఆవాహన చేసుకొని… బమ్మెర పోతన రాసిన…