వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసే పోటీ చేస్తాయి: పవన్ కళ్యాణ్
APpolitics:‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం… ప్రజల బాగు కోసం జనసేన, తెలుగుదేశం పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రెండు పార్టీల భవిష్యత్తు కోసమో.. ఇతర అవసరాల కోసమో కాదని..నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ అరాచక పాలన సాగిస్తోందని..ఈ విద్వేష పాలన, అవినీతి పాలన, అక్రమ పాలన పోవాలన్నదే ఆకాంక్ష’ అని చెప్పుకొచ్చారు. గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో ములాఖాత్ అనంతరం…