BJPtelangana: కాంగ్రెస్ అంటేనే నమ్మక ద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్: బోయినపల్లి ప్రవీణ్

Karimnagar: రైతులకు పెట్టుబడి సహాయాన్ని పెంచుతామని, రైతుభరోసా కింద ఏటా ఎకరానికి రూ.15,000 ఇస్తామని ఆశలు పెట్టి ఏడాది కిందట కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేడు రూ .12 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని, కాంగ్రెస్ అంటేనే మోసానికి, నమ్మకద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటిదని బిజెపి కరీంనగర్ పార్లమెంటు కరీంనగర్ బోయినపల్లి ప్రవీణ్ రావు విమర్శించారు. సోమవారం కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల…

Read More

INCTelangana: ఎవుసానికి కాంగ్రెస్ భరోసా..!

Telangana: -బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు. ============== నూతన సంవత్సరం తొలివారంలోనే శుభవార్త విన్న తెలంగాణ రైతన్నలకు పది రోజుల ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చింది. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎల్లప్పుడూ ముందుండే కాంగ్రెస్ అన్నదాతలకు మరింత భరోసా కల్పిస్తూ ‘రైతు భరోసా’ను ప్రకటించి మాది ‘రైతు ప్రభుత్వం’ అని మరోసారి నిరూపించుకుంది. రైతు సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ‘రైతు రుణమాఫీ’ ‘వరికి బోనస్’ పథకాలను అమలుచేసిన కాంగ్రెస్ ఇప్పుడు…

Read More

Telangana: బీసీలకు కాంగ్రెస్ భరోసా..!

INCTELANGANA: -బి.మహేశ్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు ======================= కాంగ్రెస్ ఏడాది ప్రజా పాలనలో రాష్ట్రానికి వెన్నెముక లాంటి వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతివ్వడం గర్వంగా ఉంది. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేలా కాంగ్రెస్ సర్కారు చర్యలు చేపట్టింది. మొదటి ఏడాది పాలనలో ప్రభుత్వం బీసీల్లో భరోసా నింపడంతోపాటు, వారికి రాజకీయంగా మెరుగైన అవకాశాలు కల్పించేలా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది….

Read More

RevanthReddy: పార్టీకి ఎజెండా సెట్ చేసిన సీఎం..!

INCTELANGANA: ‘తనదాకా వస్తే కాని తత్వం బోధపడదం’టారు. ఆ గ్రహింపు అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ నాయకులకు రావాల్సిన అవసరముంది. సదరు అవసరాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గుర్తించడమే కాదు అందరికీ నొక్కిచెప్పారు. ఏమైతేనేం, ఏడాది పాలన దాటాక ఆయన నోరు విప్పారు. ఎప్పుడో ఒకప్పుడు చెప్పక తప్పని నాలుగు మంచి మాటల్ని మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు కొందర్ని కూర్చోబెట్టుకొని చెబుతూ, వారి ద్వారా సమస్త కాంగ్రెస్ శ్రేణులకు కార్యాచరణ ప్రకటించారు….

Read More

PawanKalyan: నాకు జీవితంలో ధైర్యం నింపింది పుస్తకాలే: పవన్ కళ్యాణ్

Vijayawada:  ‘నాకు జీవితంలో నిలబడే ధైర్యం ఇచ్చింది పుస్తకాలే. నిరాశలో ఉన్నపుడు దారి చూపింది పుస్తకాలే. 2047కు వికసిత భారత్ గా వేగంగా అడుగులు వేస్తున్న వేళ విజ్ఞానకాంతులు నిండే సమూహం అవసరం. అందుకు పుస్తకాలు దారి చూపుతాయ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్  అన్నారు. రేపటి యువత సాహితీ సంపదను కాపాడేలా తయారు కావాలన్నారు. దీని కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఓ వినూత్నమైన సాహితీయాత్రను మొదలుపెట్టబోతోందని చెప్పారు. తెలుగుభాషకు వన్నెతెచ్చిన గొప్ప సాహితీ…

Read More

literature: నిర్ణయించడానికి నీవెవరు..?

ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): పుస్తకాలు… సమాచార సమాహారమో, భావాల పల్లకీలో, ఆలోచనల మేళవింపో, కాల్పనిక సృజనో, ఆత్మకథో, కథో, కాకరకాయో…. ఏదో ఒకటి. అందులో నచ్చినవుంటాయ్, కొన్ని నచ్చనివీ ఉంటాయ్! ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చాలనీ లేదు. మనుషులు, వారి ఆసక్తి, ఆలోచన, భావజాలాన్ని బట్టి ఉంటుందదంతా! రాసి అమ్మే, కొని చదివే జనం అవసరం, అభిరుచి, ఆసక్తిని బట్టి రకరకాల పుస్తకాలు పుడతాయి, మార్కెట్లోకొస్తాయి. ఇష్టమైనవి కొంటాం. ఇష్టం లేనివి… చూసో, తిరగేశో,…

Read More

Telangana: బీసీలపై చర్చకు సిద్ధమా కవితకు టీపీసీసీ చీఫ్ మహేష్ సవాల్..!

INCTELANGANA: బీసీల అభివృద్ధి కోసం పదేళ్ల బీఆర్ఎస్ పాలన.. ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రకటన విడుదల చేశారు. కవిత ధర్నా చేపట్టబోయే ముందు తాను సంధించిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని సవాల్ విసిరారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో బీసీలను వంచించడమే కాకుండా.. వారికి న్యాయంగా అందాల్సిన నిధులను ఖర్చు చేయకుండా నిట్టనిలువునా ముంచిందన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత…

Read More

Delhielection2025: ఆప్ కి అంత ఈజీ కాదు..!

AAP: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అర్వింద్ కెజ్రీవాల్ రాజకీయాలకు అగ్నిపరీక్ష రేపటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. 2025 ఆరంభంలో జరిగే ఈ ఎన్నికల తర్వాత, ఏడాది చివర్లో జరగాల్సిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు దేశంలో ఎన్నికలేవీ లేవు. కేంద్రంలోని ఎన్డీయే, ముఖ్యంగా కూటమి పెద్దన్న బీజేపీ తలపోస్తున్నట్టు ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ఫలితంగా జమిలి ఎన్నికలు 2027లోనే జరిపేట్టయితే, ఇక 2026 లోనూ ఏ ఎన్నికలూ ఉండకపోవచ్చు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఢిల్లీ…

Read More

TSAT: యువతకు దిక్సూచి టీ-సాట్..!

T- SAT: సాంకేతికంగా దూసుకుపోతున్న నేటి యుగంలో టీ-సాట్ ఆధునిక టెక్నాలజీతో తెలంగాణలోని అన్నివర్గాలకు చేరువవడమే కాకుండా, ఒక వరంగా మారింది. ప్రస్తుత కాలంలో అన్ని అంశాలు సాంకేతికతతో ముడిపడి ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు, యువతకు, మహిళలకు, రైతులకు ఇలా అందరికీ టీ-సాట్ చేదోడుగా ఉంటుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో ఇంటింటికీ దగ్గరవుతుంది. ఆధునికానికి అనుగుణంగా టీ-సాట్ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని అన్ని రంగాల్లో విస్తరించేలా…

Read More

ManmohanSingh : మంచి పనుల్తో మాట్లాడిన మౌని..!

ManmohanSingh: పీవీ నర్సింహారావు దూరదృష్టి, సోనియాగాంధీ త్యాగం.. వెరసి, భారత దేశానికి కీలక సమయంలో పదేళ్లు ప్రధానమంత్రిగా లభించిన మానవతానేత మన్మోహన్సింగ్! ‘మాట్లాడరు, సొంత నిర్ణయాలు తీసుకోలేరు, టెన్ జన్పథ్ చేతిలో కీలుబొమ్మ’ లాంటి విమర్శలున్నా… ఎన్నో విషయాల్లో ఆదర్శనేత ఆయన. నిగర్వి, నిరాడంబరుడు, నిష్కళంకుడు, అన్నిటికీ మించి పక్కా నిజాయితీపరుడు. కష్టకాలంలో దేశాన్ని ఆర్థికంగా పునరుజ్జీవింపజేసిన సంస్కర్త. ఆర్బాటం లేకుండా దశాబ్దాల తరబడి దేశ గమనాన్ని నిర్దేశించే ఉపాధిహామీ, ఆహారభద్రత, సమాచారహక్కు, విద్యాహక్కు, భూసేకరణ-2013, కనీస…

Read More
Optimized by Optimole