Muslims: ముస్లిం పురుషులు ఎన్ని పెళ్లిళ్లు చేసుకోవచ్చు..?

Allahabad: ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్ఖన్‌కు పెళ్లయ్యింది. ఆ విషయాన్ని దాచి మరో అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు. అతను ముస్లిం. ఆ మహిళలిద్దరూ ముస్లింలు. రెండో భార్య కోర్టును ఆశ్రయించింది. తన భర్తకు ముందే పెళ్లయిన విషయం తనకు తెలియదని, ఆ విషయం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని వివరించింది. తన పెళ్లిని రద్దు చేయాలని కోరింది. కేసు అలహాబాద్ హైకోర్టు దాకా చేరింది. 2020లో మొదలైన కేసుకు సంబంధించి ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించింది….

Read Full News

TELANGANA: జూన్ 2న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో యువ కవుల సమ్మేళనం..!

Kavitha: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన యువ కవుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి ప్రకటించింది. తెలంగాణ సారస్వత పరిషత్ లో జరగనున్న ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ ను గురువారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… తెలంగాణ జీవనశైలి విశిష్టతను చాటి చెప్పడంతో పాటు యువతలో సాహితీ స్పృహను, చైతన్యాన్ని పెంపొందించడానికి ఈ యువ కవి…

Read Full News

telangana: తేలని తెలంగాణ బీజేపీ గమనం..!!

BJPTELANGANA: తెలంగాణలో బీజేపీది సంక్లిష్ట పరిస్థితి. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు అవకాశాలున్నట్టే కనిపిస్తుంది, కానీ, ఏదీ తేల్చుకోలేని సందిగ్దస్థితి నుంచి పార్టీ నాయకత్వం బయటపడట్లేదు. కొత్త రాష్ట్రాధ్యక్షుడ్ని ఖరారు చేయలేని అశక్తత! అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూలంగా, లోక్సభ ఎన్నికల్లో అనుకూలంగా ఫలితాలు సాధించిన బీజేపీ పరిస్థితి రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమిటి అంటే, ‘ఇదీ’ అని సమాధానం చెప్పలేని అయోమయం. ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందమనే రాజకీయ విమర్శల నుంచి బయటపడే గుంజాటన…

Read Full News

Telangana: గల్లాపెట్టె… నోటిమాట… ‘దివాలా అరిష్టం..!

INCTelangana: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజకీయ పరిభాష కూడా అభ్యంతరకరంగా ఉందనేది పరిశీలకుల భావన! అవి రాజకీయ ఆరోపణలైనా, వ్యక్తిగత విమర్శలైనా, సంస్థాగత వివరణలైనా… ముఖ్యమంత్రి స్థాయికి తగిన రీతిలో సాగితేనే హుందాగా ఉంటుందనేది రాజకీయ పరిభాష (పొలిటికల్ లాంగ్వేజ్) తెలిసిన వారి అభిప్రాయం. తెలంగాణ ఉద్యోగుల నిరసనోద్యమ హెచ్చరికని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర ఖజానా`ఆర్థిక పరిస్థితిపై ఆయన వెల్లడిరచిన సమాచారం తెలుగునాట చర్చనీయాంశాలయ్యాయి….

Read Full News

Telangana: స్వ‌డ‌బ్బా..ప‌ర‌నింద‌.. బీఆర్ఎస్ స‌భ‌..!!

Telangana:  టీపీసీసీ అధ్య‌క్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మ‌హేష్ కుమార్ గౌడ్‌ ============= బీఆర్ఎస్(భారాస )సిల్వర్ జూబ్లీ  వేడుకలు ఊరించి ఉసూరుమనిపించినట్టు  సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా జనసమీకరణ చేసిన ఫలితం లేకుండా పోయింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగం ఆ  పార్టీ కార్యకర్తలకే నిరాశ, నిస్పృహలకు గురి చేసింది.  ప్రసంగం ఆద్యంతం పాత చింతకాయ పచ్చడిలా రొటీన్‌గా, జీర్ణించుకోలేని విధంగా సాగిందని బీఆర్ఎస్ శ్రేణులే చెప్పడాన్ని బట్టి, ఈ సభ ఎలా సాగిందో అర్థం…

Read Full News

HonourKilling:కులం ఉంటుంది.. ప్రేమికుల్ని విషం తాగమంటుంది..!

Tamilnadu : ‘పరువు హత్య’ అంటాం కానీ, ప్రేమికుల అంతానికి కారణమయ్యేది ‘కులం’. కాబట్టి వారిది ‘కులోన్మాద హత్య’. ఈ దేశంలో పరువుకు కులం ఉంటుంది. అది అత్యంత దారుణాలకు పాల్పడుతుంది. ఘోరాలు చేయిస్తుంది. అసలైన ఘోరమేమిటంటే, కులం కోసం సొంత మనుషుల్ని చంపినవారికి సైతం మద్దతు పలికే వారిని కూడగడుతుంది. ఉగ్రవాదానికి సాయం అందించినవారూ ఉగ్రవాదులైతే, కులోన్మాదానికి మద్దతు పలికేవారు కూడా కులోన్మాదులే. అలాంటి కులోన్మాదులు 2003లో చేసిన ఓ దారుణం ఇది. తమిళనాడు రాష్ట్రం…

Read Full News

Castcensus: కులగణనపై మోదీ యూ-టర్న్ ఎవరికి లాభం?

Castcensus: దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు కొన్నేళ్లుగా కులగణన డిమాండ్లు వినిపిస్తున్నా… హిందువులంతా ఒక్కటే అని చెప్తూ వచ్చిన బీజేపీ, ఎవరూ ఊహించని విధంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో జనాభా లెక్కలతోనే కులగనణ చేపట్టాలని తీర్మానించింది. కులగణన మీదే రాజకీయాలు నడుపుతున్న ప్రతిపక్షాల నోరు మూయించడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు విరుద్ధంగా తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి ప్రమాదం తెచ్చిపెట్టనుందా? అనే చర్చ మొదలైంది. మన దేశంలో మతం కన్నా…

Read Full News

BiharElection: బీహార్‌ ఎన్నికలు… ఎన్నెన్నో ప్రశ్నలు..!

BiharElection: బీహార్‌ రాష్ట్రం… 13 కోట్ల జనాభాకు నెలవు! సుమారు 8 కోట్ల ఓటర్లు ఉన్న ఆ రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహారీల్లో అభివృద్ధి, ఉపాధి కావాలని, వలసలు నియంత్రించాలని డిమాండ్స్‌ పెరగడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న దశలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో బీహార్‌ రాష్ట్రానికి…

Read Full News

LoveDrama: ఔను..వాళ్లిద్దరూ పెళ్లి తర్వాత ప్రేమించుకున్నారు..!

LoveDrama : ప్రేమించి పెళ్లి చేసుకోవడమే మంచిదని కొందరి అభిప్రాయం. పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకోవడం ఉత్తమం అని మరికొందరి ఉద్దేశం. ప్రేమంటూ ఉంటే చాలు, పెళ్లికి ముందైనా, తర్వాతైనా హాయిగా జీవించొచ్చు అనేది అందరి అభిప్రాయం. వాదోపవాదాలు ఎలా ఉన్నా, ప్రపంచంలో ప్రేమ అనేది చాలామంది ఒప్పుకునే విలువైన సాధనం. చాలా ప్రేమకథలు పెళ్లితో పూర్తయితే, కొన్ని ప్రేమకథలు పెళ్లి తర్వాతే మొదలవుతుంటాయి. అలాంటి కథ ఒకటి ఇది. 2024లో పాకిస్థానీ దర్శకుడు బదర్ మెహమూద్ తెరకెక్కించిన…

Read Full News

INC: కాలంతో కాంగ్రెస్ కాలు కదిపితేనే…!

INC: కాంగ్రెస్ పునర్వైభవం, కాంగ్రెస్ కన్నా దేశానికి ఎక్కువ అవసరమనే ప్రజల ఆకాంక్షని పార్టీ నాయకత్వం గ్రహించినట్టుంది. కానీ, అదెలా జరగాలనే విషయంలో దానికొక స్పష్టత లేదని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) 86వ జాతీయ సమావేశ వేదిక వెల్లడి చేసింది. పాత విషయాల వల్లెవేతనే తప్ప… జాతికి నూతన ఆశలు కల్పించే, మిత్రపక్షాలకు కొత్త నమ్మిక ఏర్పరిచే, పార్టీ శ్రేణులకు తాజా ప్రేరణనిచ్చే అంశాలేవీ తీర్మానాల్లోకి రాలేదు. రాజ్యాంగ స్ఫూర్తి రక్ష, లౌకికవాద పరిరక్షణ,…

Read Full News
Optimized by Optimole