Hyderabad: “స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ ’గా తెలంగాణ:మంత్రి శ్రీధర్ బాబు

Hyderabad: “స్కిల్ కేపిటల్ ఆఫ్ ది గ్లోబ్ ’గా తెలంగాణను మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న యూకేకు చెందిన సెమీ కండక్టర్ దిగ్గజ సంస్థ ఆర్మ్ హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులతో ఆయన బుధవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో భేటీ అయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు,…

Read Full News

Inc: బాల కార్మిక నిర్మూలన మనందరి బాధ్యత: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతగా భావించాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బాల కార్మిక సమస్యపై ప్రజలందరిలో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వంతో పాటు సామాజిక సంస్థలు, ప్రజా ప్రతినిధులు, మానవ హక్కుల కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. “బాల కార్మిక వ్యవస్థను శాశ్వతంగా అంతం చేయాలంటే కేవలం చట్టాలు సరిపోవని.. వాటి అమలు పాటించడమే కాక, సామాజికంగా చైతన్యం…

Read Full News

Telangana: జాగృతి కమిటీలతో కవిత జోరు..!

తెలంగాణా: జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా దూకుడును ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభతో  తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆమె..సభకి సంబంధించి తండ్రి కేసిఆర్ కి లేఖ రాశారు. ఆ లేఖ లీక్ కావడంతో ఇండైరెక్టుగా కేటీఆర్, సంతోష్, హరీష్ రావులను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలను సంధించారు. తదనంతర పరిణామాలతో ఆమె పార్టీ మార్పుపై అటు బీఆర్ఎస్ వర్గాల్లోనూ… ప్రజల్లో తీవ్ర చర్చ రేకెత్తింది. కవిత సొంతగా పార్టీ పెడుతుందని, కాంగ్రెస్ లో చేరుతుందంటూ ఊహాగానాలు…

Read Full News

IncTelangana:రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ ధ్యేయం: టీపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

షాద్ నగర్: రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, దేశ సమగ్రత కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ దేశ విభజన రాజకీయాలను, విచ్ఛిన్న శక్తులను ఎదిరించేందుకు “జై బాపు, జై భీమ్,జై సంవిధాన్” కార్యక్రమాలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్ధృతంగా చేపడతామని హెచ్చరించారు.మంగళవారం షాద్ నగర్ లో స్థానిక ఎమ్మెల్యే వీర్ల శంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” కార్యక్రమంలో…

Read Full News

Movie: అంగట్లో ఆడయంత్రాలు దొరికితే బాగుండు..!

Kannadamovie:  అవును! అంగట్లో ఆడయంత్రాలు దొరికితే బాగుండు. కుంజి ఇవ్వగానే బొమ్మ తిరిగినట్టు, ఇవ్వమనగానే మగబిడ్డను కని మొగుడి చేతిలో పెట్టే ఆడయంత్రాలు దొరికితే ఎంత బాగుండు! మీరు దేవుళ్లని నమ్ముతారా? విష్ణుమూర్తి, లక్ష్మీదేవి సత్యకాలపు మనుషులు. శ్రీవల్లిని కన్నారు. సుబ్రహ్మణ్యస్వామికి ఇచ్చి పెండ్లి చేశారు. మిగిలిన ఏ దేవుళ్లూ ఆడపిల్లల జోలికి పోలేదు. మేరీ గర్భవతి అయ్యి, మొదట యేసుక్రీస్తునే కన్నది కానీ ఆడబిడ్డను కనలేదు. జనం గుళ్లు కట్టి పూజించే దేవుళ్లకే ఆడపిల్లలు లేరు….

Read Full News

Vetrimaaran:‘తను సినిమా దర్శకుడైనంత మాత్రాన నా ఐడెంటినీ వదులుకోలేను’: ఆర్తి వెట్రిమారన్

AarthiVetrimaaran: (తమిళ సినీ దర్శకుడు వెట్రిమారన్ భార్య ఆర్తి. వారిద్దరిదీ ప్రేమ వివాహం. ఆర్తి ఉద్యోగిని. వారికి ఇద్దరు పిల్లలు. అమ్మాయి పూన్‌త్రెండల్, అబ్బాయి కదిరవన్. ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌లో ఆర్తి చెప్పిన విషయాలు ఇవి..) * నాది నాగర్‌కోయిల్, తనది కడలూర్. చెన్నై లయోలా కాలేజీలో చదివేటప్పుడు మా పరిచయం ప్రేమగా మారింది. ‘మనిద్దరం పెళ్లి చేసుకుందామా?’ అని నేను తనను(వెట్రిమారన్) అడిగాను. ‘మన పెళ్లికి పదేళ్లు పడుతుంది. ఫర్లేదా?’ అని అడిగారు. తను…

Read Full News

Movie: ‘పెద్ద ఆదిరాల’ రాజుగాడి విజయగాథ.. చూసి తీరాల్సిందే..!

Movie review: ‘పాతాళభైరవి’ సినిమా గుర్తుందా?(అసలు మర్చిపోతేకదా!) రాకుమారిని ప్రేమించిన తోటరాముడికి మహారాజు షరతు విధించాడు. సిరిసంపదలు తీసుకొస్తేనే రాకుమారితో పెళ్లి చేస్తానన్నాడు. సరే.. ఆ తర్వాత తోట రాముడు మాంత్రికుడి వద్ద కొలువు చేయడం, పాతాళభైరవిని ప్రసన్నం చేసుకోవడం మనకు తెలిసిందే! ‘మిస్సమ్మ’ గుర్తుందా? అందులో కొలువున్నవారి మధ్య ప్రేమ. ఆ కొలువులు నిలుపుకునే క్రమంలో తగవులు, అభిమానాలు, అపార్థాలు. ‘మాయాబజార్’(వాట్ ఎ ఫిల్మ్)లో మరో రకం కథ. పాండవులు కొలువు తప్పి, అడవుల పాలైనందుకు…

Read Full News

Becareful: పెళ్లయిన రెండో రోజుకే బిడ్డ పుట్టింది.. ఎలా?

Big alert:  పెళ్లయినవారికి పది నెలల తర్వాత కానీ బిడ్డ పుట్టే అవకాశం లేదు. అది కూడా వారిద్దరి మధ్య లైంగిక బంధం సరిగ్గా ఉంటేనే సాధ్యం. అయితే పెళ్లయిన రెండో రోజే బిడ్డ పుట్టడం ఎక్కడైనా సాధ్యమేనా? తమిళనాడులో ఈ విషయం జరిగింది. ఇది అనేక అనుమానాలకు ఆస్కారమివ్వడంతోపాటు పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. తమిళనాడుకు చెందిన ఓ అమ్మాయికి, అబ్బాయికి గతేడాది అక్టోబరులో వివాహ నిశ్చితార్థం జరిగింది. అంతకుముందు వారిద్దరికీ అస్సలు…

Read Full News

OTT: వలస నిట్టూర్పుల మాటున మానవత చూపిన ఓదార్పు..!

TouristFamily:  ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమా గురించి చెప్పేముందు, ఓసారి దేశంలోకి వస్తున్న అక్రమ వలసదారుల గురించి మాట్లాడుకుందాం. సరిహద్దు దేశాల నుంచి ఇతర దేశాలకు అక్రమంగా వలసవచ్చే పరిస్థితి అమెరికాతోసహా ప్రపంచంలోని దాదాపు ప్రతిదేశం అనుభవిస్తూనే ఉంది. ఉన్న దేశంలో తిండి లేక, చేయడానికి పనిలేక, ప్రశాంతంగా ఉండే పరిస్థితులు కనిపించక పక్క దేశాలకు వెళ్లి ఎలాగోలా బతికేద్దామనుకునే పరిస్థితి చాలాచోట్ల ఉంది. మనదేశానికి పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నుంచి వలసదారులు ఎన్నో ఏళ్ల నుంచి వస్తూనే…

Read Full News
Optimized by Optimole