VineshPhogat: 140 కోట్ల హృదయాలు గెలిచిన విజేతవు.. నీవు ‘ జగద్విజేతవు’..!
ఆర్. దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…? ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వీధి మలుపు జంతర్-మంతర్ లో కూడా ఏకరీతిన పోరాడే మొక్కవోని మనోదైర్యాన్నీ, జరిగిన అవమానాలన్నింటికీ జవాబుగా పతకం గెలిచి తీరాలన్న సడలని పట్టుదలని ఒక భుజాన ఒలంపిక్ గ్రామానికి మోసుకొచ్చిందామె! మరి, బరువు పెరగదా? మరొ భుజానేమో…. అధికారం, మందపు పొరై కళ్లను కప్పేసిన అంధకారంలో కనిపించకుండా పోయిన…