Kollywood: 67 ఏళ్ల వయసు..37 ఏళ్ల కెరీర్..ఓ జాతీయ పురస్కారం…!
విశీ: తమిళ దర్శకుడు విసు తెలుగులో తీసిన మొదటి సినిమా ‘శ్రీమతి ఓ బహుమతి’ సినిమా తెలిసే ఉంటుంది. దాని తమిళ వెర్షన్ ‘తిరుమతి ఒరు వెగుమతి’ సినిమాలో 30 ఏళ్ల యువకుడు నటించాడు. చాలా చిన్న పాత్ర. ఇప్పుడు సినిమా చూస్తే అందులో అతను ఉన్నాడని వెతికి గుర్తుపట్టాలి. కానీ అదే యువకుడు 38 ఏళ్ల తర్వాత తన 67వ ఏట జాతీయ పురస్కారం అందుకుంటాడని ఎవరూ అప్పుడు ఊహించి ఉండరు. అదే సినిమారంగం గొప్పతనం….