మా ఎన్నికలపై ట్విట్టర్లో స్పందించిన ప్రకాశ్ రాజ్..
సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించిన మా ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్త కార్యవర్గం పగ్గాలు చేపట్టింది. అయినా మా ఎన్నిక వేడి ముగిసిపోలేదు. ఓటమి పాలైన ప్రకాష్ రాజ్ ప్యానల్ మాత్రం అన్యాయంగా, అరాచకత్వంతో విష్ణు ప్యానెల్ గెలుపొందిందని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు పోలింగ్ బూత్ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయనీ, వాటిని మాకిమ్మని ప్రకాష్‌రాజ్ ఇప్పటికే మా ఎన్నికల అధికారిని కోరారు. అయితే, మొదట నిబంధనలకు అనుగుణంగా ఇస్తామని చెప్పిన ఎన్నికల అధికారి… ఇప్పటి వరకూ…