ప్రతిఘటన సాంగ్ !
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం పుడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి పెరిగి పెద్దకాగానే ముద్దు మురిపాలకేడ్చి తనువంతా దొచుకున్న తనయులు మీరు మగసిరితో బ్రతకలేక కీచకులై కుటిల కామ మేచకులై స్త్రీ జాతిని అవమానిస్తే మీ అమ్మల సన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్నా ఈనాడే మీకొసం కన్న మహాపాపానికి ఆడది తల్లిగమారి మీ కండలు…