INC: కష్టాల కడలి ఈదుతున్న కాంగ్రెస్..!
INC: ‘‘మొదలు మొగురం కానిది కొన దూలమవుతుందా?’’ అని సామెత. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అచ్చం ఇలానే ఉంది. మొగురం (స్తంభం) కన్నా దూలం (ఇంటి నిర్మాణంలో మొగురాలపై అడ్డంగా పరిచే బీమ్) వ్యాసపరిధి ఎక్కువ. ఓ చెట్టు ఖాండపు మందం మొగరానికే సరిపోనపుడు, ఇక ఆ చెట్టు కొన దూలానికి సరిపోవడం అసాధ్యమనే అర్థంలో వాడతారు. ఒకటి తర్వాత ఒకటి… రాష్ట్రాల్లో తగులుతున్న ఎదురుదెబ్బలు కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి….