Rahulgandhi: రాహుల్ కి ముత్తాత నెహ్రూ జీ సాలు వస్తే మరో మూడేళ్లలో ప్రధాని పదవి!
Nancharaiah merugumala senior journalist: కాంగ్రెస్ ఏకైక అగ్రనేత రాహుల్ గాంధీకి బుధవారం 54 ఏళ్లు నిండిపోయాయి. ఆయన ముత్తాత (‘గ్రేట్’ గ్రాండ్–ఫాదర్!) పండిత జవాహర్ లాల్ నెహ్రూ 57 ఏళ్ల ఆర్నెల్ల వయసు దాటాక భారత తొలి ప్రధానిగా (అది తాత్కాలిక జాతీయ ప్రభుత్వమే గాని పదవి పదవే కదా!) 1947 ఆగస్టు అర్థరాత్రి పదవిని చేపట్టారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ 1984లో అక్టోబర్‌లో 40 సంవత్సరాల వయసులో భారత ప్రధాని అయ్యారు. తల్లి…