Appolitics: బాబుది నితీశ్ బాటేనా… ?
Appolitics: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడువనున్నారా? రాష్ట్రంలో తనయుడు లోకేశ్‌కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్లో పలు రాష్ట్రాల్లోనూ రాజకీయ ముఖచిత్రాల మార్పు, పునరేకీకరణలు, వారసత్వ స్థిరీకరణలు కళ్లకు కడుతున్నాయి. ఉష్ణమండల దేశం భారత్‌లో సన్ (ఎస్‌యుఎన్) స్ట్రోక్ లాగే దేశ రాజకీయాల్లో సన్ (ఎస్‌ఓఎన్) స్ట్రోక్‌లు కూడా ఎక్కువే! వయసు రీత్యా గౌరవప్రద రాజకీయ ముగింపు కోరుకుంటున్న ఇద్దరు నేతలు,…
