ఆసక్తి రేకెత్తిస్తున్న రాజేంద్రనగర్ రాజకీయం…
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ రాజకీయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. నియెజకవర్గం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కు వ్యతిరేకంగా బిఆర్ ఎస్ నేతల వ్యవహరం హాట్ టాపిక్ గా మారింది. అటు కాంగ్రెస్ నేతల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంటే.. గ్రేటర్ లో పట్టున్న బీజేపీ బలమైన అభ్యర్థిని బరిలోకి దించి లబ్ధి పొందాలని భావిస్తోంది. ప్రకాశ్ గౌడ్ మూడు పర్యాయాలుగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టిడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ప్రత్యర్థి పార్టీలను బురిడికొట్టించడంలో ఆయనకు ఆయనే…