Karimnagar: విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా: బోయినపల్లి ప్రవీణ్
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గత నెలరోజులుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వంలో చలనంలేదని మండిపడ్డారు. వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. ఇంత జరుగుతుంటే సీఎం రేవంత్ స్పందిచకపోవడం విడ్డురంగా ఉందన్నారు. తక్షణమే ఘటనలపై విచారణకు కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో…