సాగర్ ఉప ఎన్నికల్లో గెలిచేది బీజేపీ : బండి సంజయ్
అధికార తెరాసకు ప్రజలు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మఠంపల్లి మండలం గుర్రంబోడుతండా భూముల కోసం గిరిజనుల పక్షాన పోరాడుతున్న భాజపా నాయకులు విడుదల సందర్భంగా కోదాడ వచ్చిన సంజయ్ భాజపా నేత ఓవీ రాజు నివాసంలో మీడియాతో మాట్లాడారు. సర్వే నంబరు 540లో ఉన్న 6,200 ఎకరాల గిరిజన భూములను తెరాస, కాంగ్రెస్ నాయకులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన గిరిజనులపై అక్రమ…