journalism: జర్నలిజంలో “నా వాళ్లు ”…
ఆర్. దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్టు): జర్నలిజంలో వున్న యువతను చూస్తే నాకు బాధ, ఆశ…. రెండూ కలుగుతాయి. రోజు రోజుకూ దిగజారుతున్న వృత్తి విలువలు, ప్రమాణాల వడిలో పడి…. తెలిసి కొంత, తెలియక కొంత వారూ కొట్టుకుపోతున్నారే అని బాధ. ఉదాత్తమైన ఆ వృత్తి లక్ష్యం, కర్తవ్యం తో పాటు నేడు క్షేత్రంలో వున్న వాస్తవ పరిస్థితులను గ్రహించి… వారే ఏదోరోజ్న మార్పుకు వాకిళ్లు తెరుస్తారని నాదొక ఆశ. నేడు నాలుగు రోడ్ల కూడలిలో…