రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ వెంటనే అమలు చేయాలి: సంకినేని వెంకటేశ్వర్ రావు
కోదాడ: తెలంగాణ ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల లోపు రుణమాఫీ ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు. కోదాడ పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగోస – బిజెపి భరోసా కార్యక్రమా కార్నర్ మీటింగ్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతి యువకులకు నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవని…హత్యలు, అక్రమాలు ,దౌర్జన్యాలతో రాష్ట్రం నలిగిపోతుందని…