Guppedamanasu: ప్రతి ఒక్కరిలో స్త్రీ ఉంటుంది..!
సాయి వంశీ ( విశీ) : శరత్‌బాబు గారు మరణించినప్పుడు అందరూ ‘సాగరసంగమం’, ‘సితార’, ‘అభినందన’, ‘సీతాకోకచిలుక’ లాంటి సినిమాల్లో ఆయన నటన గురించి ప్రస్తావించారు. ‘గుప్పెడు మనసు'(1979) గురించి ఎవరూ రాసినట్టు కనిపించలేదు. ఆ సినిమా గురించి చెప్పుకోకుండా ఆయన కెరీర్ గురించి చెప్పడం కష్టం. తెలుగులో వచ్చిన అతి విలువైన సినిమాల్లో అదీ ఒకటి. కె.బాలచందర్ గారి క్రియేషన్. కమర్షియల్లీ ఫ్లాప్. క్లాసికల్లీ హిట్. సుజాత, సరిత, శరత్‌బాబు.. ఎవరికి ఎక్కువ మార్కులు వేయాలో…