literature: రచయితలై బతికి బట్టకడదామనేనా?
విశీ( సాయి వంశీ): (Note) : ఇది సరదాగా రాసిన పోస్టు. ఇది ఎవర్నీ ఉద్దేశించింది కాదు. చదివి సరదాగా నవ్వుకోండి…. అని నేనంటే అచ్చంగా నమ్మేరు! అలా ఏమీ లేదు. ఇది సీరియస్‌గా రాసిందే. నాతోసహా కొంతమంది స్వీయ అనుభవాలు విని రాసింది. మనకు ‘రచయిత’ అని పేరు రావడమూ, మన ఇంటిని పోలీస్‌స్టేషన్‌కు అద్దెకివ్వడమూ ఒక్కలాంటివే! వేళాపాళా లేని అనేక విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అనేక ఊహాగానాలు మన మీద చెలరేగుతూ ఉంటాయి….