CPM: ప్రమాదకర రోడ్డునీ బీటి రోడ్డు గా మార్చాలి: సిపిఎం మండల పార్టీ
Atmakur : ఆత్మకూర్ మండలం సిపిఎం పార్టీ పోరుబాట పట్టింది. తుక్కాపురం నుండి రహీంఖాన్ పేట్ వరకు ప్రమాదకరంగా ఉన్న కంకర రోడ్డునీ బీటి రోడ్డు గా మార్చాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి వేముల బిక్షం మాట్లాడుతూ… నిత్యం మోత్కూర్ నుంచి హైద్రాబాద్ కి వెళ్లే వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంటుందని.. గుంతల వలయాల రోడ్డుతో ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. సంవత్సరం…