SuryaPeta Tswrds: ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో అధ్యాపక పోస్టు భర్తీకి ప్రకటన..

SuryaPeta: సూర్యాపేట బాలెం ప్ర‌భుత్వ సాంఘీక సంక్షేమ మ‌హిళ డిగ్రీ క‌ళాశాలలో అతిధి అధ్యాప‌క పోస్టుల‌కు ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అర్హూలైన అభ్య‌ర్థులు అధ్యాప‌క పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ప్రిన్సిపల్ డాక్టర్ పున్య శైలజ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మైక్రోబ‌యాల‌జీ-1 సబ్జెక్టు సంబంధించిన అధ్యాపక పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు జ‌న‌వ‌రి 31 లోపు గ‌డువు ఉన్న‌ట్లు ప్రిన్సిప‌ల్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.