kalkireview: ప్రభాస్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898AD ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , థీమ్ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మహనటి తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా గ్యాప్ తీసుకుని భారీ తారాగాణంతో ఈ సినిమాను తెరకెక్కించాడు. విజువల్ వండర్గా తెరకెక్కిన కల్కిపై ప్రభాస్ అభిమానులతో పాటు సినిఅభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..!
కథ :
కురుక్షేత్రం ముగిసిన 6 వేల సంవత్సరాల తర్వాత.. భూమ్మీద వనరులన్నీ అంతరించిపోతున్న దశలో చివరగా మిగిలిన కాశీ పట్టణం వైపు ప్రజలు క్యూ కడతారు.అక్కడే సుప్రీమ్ యాస్కిన్ ( కమల్ హాసన్) కాంప్లెక్స్ అనే వండర్ ఫుల్ లోకాన్ని క్రియేట్ చేసుకుని ఆ ప్రాంతాన్ని లీడ్ చేస్తుంటాడు. స్వచ్ఛమైన గాలి, నీరు దొరికే కాంప్లెక్స్ లోకి వెళ్లాలని కాశీ ప్రజలు ఆశపడతారు. దీంతో అక్కడ ఉండే భైరవ ( ప్రభాస్) కాంప్లెక్స్ లోకి వెళ్లేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే కాంప్లెక్స్ లో కొందరు అమ్మాయిలను బంధించి ప్రత్యేక ప్రక్రియ ద్వారా ” ప్రాజెక్టు కె “( projectk) పేరుతో గర్భం దాల్చేలా చేస్తారు. గర్భం దాల్చిన అమ్మాయిల్లో సుమతి( దీపికా పదుకోనే) కాంప్లెక్స్ నుంచి తప్పించుకుంటుంది. అసలు సుమతి ఎవరు? ఆమెను పట్టుకోవడానికి భైరవ ఎందుకు బయల్దేరాడు? సుమతిని అతని చేతికి చిక్కకుండా అడ్డుపడ్డ అశ్వద్ధామ ( అమితాబ్ బచ్చన్) ఎవరు? ఇంతకీ సుప్రీమ్ యాస్కీన్( కమల్ హాసన్) ప్లాన్ ఏమిటి? అసలు కల్కి ఎవరు ? చివరికి సుమతిని అశ్వద్ధామ రక్షించాడా లేదా అన్నది తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే..!
ఎలా ఉందంటే..?
సినిమా ఫస్ట్ ఆఫ్ పరంగా బాగుంది. సినిమా మొదలు కురుక్షేత్ర సంగ్రామం ఎపిసోడ్ ఆకట్టుకుంది. ప్రభాస్, ఎంట్రీ.. ” బుజ్జి అండ్ బైరవ ” కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక్కో పాత్రను, ఒక్కో ప్రాంతాన్ని పరిచయం చేసిన తీరు న భూతో న భవిష్యతి. సినిమా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ సినిమాకే హైలెట్.
సెకండాఫ్ పరంగా సినిమా విజువల్ వండర్ అనడంలో సందేహం లేదు. ద్వితీయార్ధంలో ఒక్కో సన్నివేశం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ వెళుతుంది. ప్రభాస్ – అమితాబ్ బచ్చన్ మధ్య సాగే యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి.చివరి అరగంట అయితే గూస్ బంప్స్ గ్యారెంటీ.
ఇక నటన పరంగా ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తమ తమ పాత్రల్లో జీవించేశారు. దీపికా పదుకోనే తన నటనతో ఆకట్టుకుంది. సీనియర్ నటులు శోభన, రాజేంద్ర ప్రసాద్ నటనతో మెప్పించారు. మిగిలిన నటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.
టెక్నికల్ పరంగా చూస్కుంటే.. దర్శకుడు నాగ్ అశ్విన్ తెలుగు సినిమాకు దొరికిన మరో ఆణిముత్యం అనడంలో సందేహం లేదు. ఆయన విజినరీ తెరపై ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. ఈ సినిమా నాగ్ అశ్విన్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు బలం. స్టోజి సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ ఎసెట్. నిర్మాత అశ్వినీదత్ ఖర్చు తెరపై ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది.
” చివరగా ఒక్క మాటలో.. హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్.. విజువల్ వండర్ కల్కి…”
రివ్యూ; 3.75/5 ( సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)