SuryaPeta: పెన్ పహాడ్ ZPHS (1997- 98) విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం..!

సూర్యాపేట:  పెన్ పహాడ్ మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ 10 th ( 1997- 98) బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన అలనాటి గురువులైన శ్రీనివాస్ రెడ్డి , వెంకట్ రెడ్డి , అరుణ్ కుమార్ , శ్రవణ్ కుమార్ , లక్ష్మి కాంత రావు( రిటైర్డ్) లను శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఇక కార్యక్రమంలో భాగంగా గురువులకు  మొమెంటో బహుమతులను బహుకరించారు. 26 సంవత్సరాల తర్వాత అందరూ ఒకచోట కలిసి గత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం సంతోషం గా ఉందని హర్షం వ్యక్తం చేశారు . ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

గురువులు  మాట్లాడుతూ .. తమ దగ్గర పాఠాలు నేర్చుకొని జీవితంలో  ఉన్నత స్థితికి ఎదిగిన  విద్యార్థులను చూస్తే  గర్వంగా ఉందని అన్నారు. ఎవరు ఎక్కడ ఉన్నా.. మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని, కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని హితువు పలికారు.