Prajahitayatra: 6 గ్యారంటీల కోసం బీఆర్ఎస్ ఎందుకు కొట్లాడటం లేదు?
Bandisanjay: ‘‘మరో 10 రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతోంది. 6 గ్యారంటీలు అటకెక్కబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. ఎన్నికల హామీలను కాకి ఎత్తుకెళ్లిందని చెప్పబోతున్నారని.. గట్టిగా నిలదీస్తే మేం హామీలను అమలు చేయాలనుకున్నాం.. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది… ఎన్నికలైపోంగనే అమలు చేస్తామని కాంగ్రెస్ కాకమ్మ కథలు చెప్పబోతుందని ఆయన ఎద్దేవ చేశారు. ప్రజాహిత యాత్రలో భాగంగా బండి సంజయ్ జమ్మికుంట టౌన్ లో ప్రసంగించారు….