NagobaJatara:నాగోబా జాతర, జల సేకరణ, పాదయాత్ర ఎందుకు ? ఎప్పటిది ?
నందిరాజు రాధాకృష్ణ (వెటరన్ జర్నలిస్ట్): నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత రాత్రంతా నాగదేవతకి మహాపూజ నిర్వహిస్తారు. అది వరుసగా 5 రోజులపాటు కోలాహలంగా జాతర కొనసాగుతుంది. జాతర ఫిబ్రవరి 9 పుష్యమాస అమావాస్య అర్థరాత్రి నాగదేవతకి పవిత్ర గోదావరి నదీజలాభిషేకంతో ప్రారంభమవుతుంది. అనాదిగా వస్తున్న ఆచారాలకి అనుగుణంగా జన్నారం మండలం కలమడుగుకు సమీపంగా పారే గోదావరి నుంచి ప్రత్యేకమైన కుండలలో జలాన్ని తీసుకువస్తారు మేస్రం కులస్తులు…