తెలంగాణలో లాక్ డౌన్ మే 30 వరకు!

తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడగిస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఉన్న లాక్ డౌన్ గడువును.. ఈ నెల 30 వరకూ లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. అంతేకాక ఈ నెల20న జరగాల్సిన కేబినెట్ భేటిని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లాక్‌డౌన్ పొడగింపు అంశంపై సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా మంత్రుల అభిప్రాయం తీసుకొని.. లాక్ డౌన్ పొడగిస్తున్నట్లు ముఖ్యమంత్రి సీఎస్ కు ఆదేశాలు జారీచేయాలని ఆదేశించారు. దీంతో ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ ను మరో ఎనిమిది రోజుల పొడగిస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.