అనాథ పిల్లలకోసం సీఎం జగన్ కీలక నిర్ణయం!

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనాథలైన పిల్లలను ఆదుకొనేందుకు ప్రభుత్వం రూ.10లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ఈ మొత్తాన్ని చిన్నారుల పేరిట ఎఫ్‌డీ చేయనున్నారు. ఎఫ్‌డీపై వచ్చే వడ్డీతో అనాథ పిల్లల అవసరాలు తీర్చాలని సీఎం సూచించారు. కొవిడ్‌ మృతుల పిల్లలకు ఆర్ధిక సాయంపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఆర్థిక సాయంపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది.
మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో లాక్ డౌన్ ను మే 31 వరకు పొగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.