BJPTELANGANA: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు ఈటల రాజేందర్..?

Rajendra ,etala, etala rajendra

BJPTELANGANA: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడెవరు అన్న ఉత్కంఠకు కొద్ది గంటల్లో తెరపడనుంది. ఈ పదవికి ప్రధానంగా నలుగురి పేర్లు తెరపైకి వచ్చాయి. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రామచందర్ రావు. అయితే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈటల రాజేందర్ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

బలమైన బీసీ నేతగా ఈటల..

తెలంగాణలో ఈటల రాజేందర్‌కు బలమైన బీసీ నేతగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఈటల, ఉద్యమ నేతగా ప్రజలకి సుపరిచితం. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలపై లోతైన అవగాహన, ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను అంచనా వేసే సామర్థ్యం ఆయనకు పాజిటివ్ అంశాలుగా భావించొచ్చు. అదే సమయంలో పార్టీలో చేరినప్పుడు కేంద్ర నాయకత్వం ఇచ్చిన హామీలు కూడా ఇప్పుడు అనుకూలమని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇక బిఆర్ఎస్ లో కీలక మంత్రిగా పనిచేసిన ఈటల, బీజేపీలో చేరిన తర్వాత హుజురాబాద్ ఉపఎన్నికను గెలిచి పార్టీకి మైల్ స్టోన్ విజయాన్ని అందించారు. బలమైన బీసీ వర్గాన్ని ఆకర్షించే నాయకుడిగా ఆయనను పార్టీ అగ్రనాయకత్వం పరిగణిస్తున్నట్టు సమాచారం. అయితే ఆర్‌ఎస్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు ఈటల నాయకత్వాన్ని ఎంత మేర అంగీకరిస్తాయన్నది చర్చనీయాంశంగా మారనుంది.

Optimized by Optimole