Telugu poetry :
” చావడానికే బతుకు”
మనం మన తాత ముత్తాతల
అడుగుజాడల్లో చెట్లలా బతుకుతాం.
పురిటిగది గూటిలో
సాలీళ్లలా బతుకుతాం.
దప్పిక అంచుల్లో మరులుగొంటాం.
చావు పుట్టుకల నడుమ
దయ్యాలకొంపలో
కలలు కంటుంటాం.
ఇంకా బతికి ఉన్నామేమో
అనిపించేలా మనం చనిపోతాం.
—
వాయుయు మూలం: వీటో అపుషానా
స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు