సెక్యులర్, ప్రభుత్వ పథకాల కోసం హిందు ఆలయాల ఆదాయం నుంచి ఒక్క పైసా ఖర్చు చెయ్యెదన్నారు పుష్పగిరి పీఠాధిపతులు విద్యాశంకర భారతి స్వామి. ఆలయాల నిధులను హిందు దేవాలయాల కోసమే ఖర్చు చేయాలని ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ పనితీరు బాగోలేదని ఆయన తెలిపారు.
ఇక ఏపీలో ఆలయాల మీద జరుగుతున్న దాడులు, ఆస్తులను కాపాడేందుకు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ వేయాలని భారతి స్వామి కోరారు. రాష్ట్రంలోని దేవాలయ పరిరక్షణ కోసం ప్రభుత్వం , పురావస్తు శాఖతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.