పార్థ సారథి పొట్లూరి: “చాయ్ వాలా అని మోడీజీ ని హేళన చేశారు దుష్ట కాంగీయులు!9 ఏళ్ళు గడిచాయి!ఎంత అన్ పాపులర్ చేయాలని చూసినా మోడీజీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చిందే కానీ తగ్గలేదు!చివరకి లారీ డ్రైవర్లతో, బైక్ మెకానిక్ లతో కలిసి చర్చలు, ఫోటోలు దిగితే ఏదన్నా లాభం ఉంటుందేమో అని ఆశ!”
నిజానికి లారీ డ్రైవర్లు కానీ బైక్ మెకానిక్ లకి కానీ రాజకీయాలని పట్టించుకొనే ఆలోచన ఉండదు.లారీ డ్రైవర్లకి కావాల్సింది మంచి రోడ్లు! జాతీయ రహదారులు వాజాపేయి గారు ప్రారంభించిన స్వర్ణ చతుర్భుజీ తో కళ కళ లాడుతున్నాయి కాబట్టి డ్రైవర్లకి సమస్య లేదు. లారీ డ్రైవర్లకి ఏది జాతీయ రహదారో, ఏది రాష్ట్ర రహదారో మనకంటే బాగా తెలుసు.ఇక బైక్ మెకానిక్ లకి వాళ్ళ రోజువారీ ఆదాయానికి రాజకీయాలకి సంబంధం ఉండదు.
రాహుల్ PR మేనేజ్మెంట్ చాలా బలహీనంగా ఉంది అనే కంటే దిక్కు తోచని స్థితిలో ఉంది అని రుజువు అవుతున్నది!ఫోటో చూడండి రాహుల్ ఢిల్లీ లోని కరోల్ బాగ్ లో ఉన్న ఒక బైక్ మెకానిక్ షాప్ లో కూర్చొని ఒక మ్ముళ్ల చక్రాన్ని తదేకంగా చూస్తూ ఉంటే ఫోటో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు!
2014 ఎన్నికలప్పుడు,2019 ఎన్నికలప్పుడు ప్రజలు తమను గెలిపిస్తారు అనే భరోసాతో ఉండేవాడు రాహుల్ కానీ అలా జరగలేదు.2024 కి మునపటి లాగ అవకుండా ఉండాలి అంటే కష్టపడాలి అనే స్థితికి తీసుకొచ్చారు మోడీజీ!జంధ్యం వేసుకొని దత్తాత్రేయ గోత్రం చెప్పుకున్నా ఫలితం లేదు! మోడీజీ కంటే ముందే అమెరికా వెళ్లి భారత వ్యతిరేక శక్తులతోరాహుల్ చర్చలు జరపడం అనేది ఆత్మ న్యూనతా భావాన్ని సూచిస్తున్నది.రాహుల్ ని ఊళ్ళు పట్టుకొని తిరిగే దశకి తీసుకొచ్చింది మోడీజీ నే!ఇక మధ్య ప్రదేశ్, రాజస్తాన్, చతీస్గడ్ లు అసెంబ్లీ కి బీజేపీ కి ఓటు వేస్తాయా లేదా అన్నది పక్కన పెడితే లోకసభ కి మాత్రం బీజేపీ కి వేస్తారు!
ఇక తెలంగాణా అంటారా గతంలో చంద్రబాబు చేసిన తప్పులే ఇప్పుడు కెసిఆర్ చేస్తున్నాడు!ఏదో తనకి లేని పరపతిని ఉన్నది అనే భ్రమలో ఉంటూ 600 కార్లతో మహారాష్ట్ర వెళితే ఓట్లు వేస్తారా అక్కడి తెలుగు వాళ్ళు? వాళ్లకి అక్కడి స్థానిక ప్రభుత్వం తో పని ఉంటుంది కానీ brs (ఒక వేళ ఒకరు గెలిస్తే ) తో ప్రయోజనం ఉండదు, కాదు.తెలివికల రాజకీయ నాయకుడు తన రాష్ట్రం మీద శ్రద్ధ పెడతాడు కానీ పక్క రాష్ట్రనికి అట్టహాసంగా వెళ్ళడు. జస్ట్ రాహుల్ ఎలా చేస్తున్నాడో కెసిఆర్ కూడా అలానే చేస్తున్నాడు.రాహుల్ కి, కెసిఆర్ కి, చంద్రబాబు కి, నితీష్ కుమార్ కి 2024 ఎన్నికలు చివరివి. గెలిచే అవకాశాలు లేవని తెలుసు వీళ్ళకి. కానీ ఆఖరి పోరాటం చేస్తున్నారు తడపడుతూ!
ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సరయిన దారిలో వెళుతున్నాడు కానీ కాంగ్రెస్ తో రహస్య ఒప్పందం చేసుకుంటే మాత్రం అది ఆత్మహత్య చేసుకున్నట్టే.గో వధ నిషేధం మీద GO ఇవ్వడం కంటి తుడుపు చర్య.విశాఖ సభలో అమిత్ షా చేసిన నిధుల దుర్వినియోగం ఆరోపణలకి G.O. తెచ్చాడు కానీ అది పేపర్ పులి మాత్రమే! ఏదో అమిత్ షా ని సంతృప్తి పరచడానికి అన్నట్లుగా ఉంది తప్పితే అది అమలు కాదు. ఇలాంటి చిల్లర రాజకీయాలు అమిత్ షా ముందు చేయకూడదు.ఆంధ్రప్రదేశ్ వరకు టీడీపీ ని నిర్వీర్యం చేసే వరకు జగన్ కి మద్దతు ఉంటుంది కేంద్ర బీజేపీ పెద్దలు ద్వారా. ఇదే తరహా రాజకీయం తెలంగాణా లో అమలు చేయించింది కెసిఆర్ ద్వారా! ఇప్పుడు జగన్ అదే చేస్తున్నాడు.
2029 నాటికి టీడీపీ స్థానంలోకి బీజేపీ వచ్చి తీరుతుంది ఆంధ్రా లో.ఎవరెన్ని విమర్శలు చేయుగాక ఆంధ్రాలో బీజేపీ కి స్పష్టమయిన వ్యూహం ఉంది. అది రాష్ట్ర బీజేపీ నాయకులకి తెలియక పోవచ్చు.ఆంధ్రా బీజేపీ నాయకత్వం అనేది బోర్డర్ చెక్ పోస్ట్ దగ్గర ఉండే సైనికులు మాత్రమే వీళ్ళు యుద్ధం చేయరు కాపలాగా ఉంటారు. యుద్ధం మొదలవగానే బోర్డర్ కి దూరంగా ఉండే ఫ్రంట్ లైన్ యుద్ధ సైనికులు రంగంలోకి దిగుతారు శత్రువుతో ముందు నుండి తలపడడానికి!
ఇదే తరహా వ్యూహం బీహార్ లో కూడా అమలులో ఉంది.నితీష్ కుమార్ బీజేపీ ని వదిలివేసినప్పుడే తన రాజకీయ ఆత్మహత్యకి రంగం సిద్ధం చేసుకున్నాడు.ఇప్పుడు తేజస్వీ యాదవ్ బీహార్ ని పాలిస్తున్నాడు. నితీష్ ఢిల్లీ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.రేప్పోద్దున నితీష్ ఢిల్లీ లో ఎటూ గెలవలేడు. పోనీ మళ్ళీ బీహార్ వచ్చి రాజకీయం చేద్దామన్నా అప్పటికి తన స్థానం సుస్థిరం చేసుకుంటాడు తేజస్వీ యాదవ్.నితీష్ ని పూచిక పుల్ల కంటే హీనంగా చూస్తాడు తేజస్వీ యాదవ్.
So! నితీష్ రాజకీయ జీవితం ఫినిష్!
నేను గతంలోనే నా పోస్ట్ లో చెప్పాను నితీష్ కుమార్ ఎట్టి పరిస్థితుల్లోనూ కెసిఆర్ ని దగ్గరికి రానీయడు అని. పాట్నా సమావేశానికి కెసిఆర్ ని పిలవక పోవడానికి కారణం కెసిఆర్ బీజేపీ కోవర్టు అని బలంగా నమ్మెట్లుగా చేసింది బీజేపీ! ఆఫ్కోర్స్ బీజేపీ కి నితీష్ కు టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగా ఉన్న రోజుల్లోనే ఈ విషయాన్ని బలంగా నాటింది బీజేపీ.ఆ భ్రమలో నుండి ఇప్పటి వరకు బయట పడలేదు నితీష్! నిజానికి నితీష్ అదే భ్రమలో ఉంచడానికి గాను కవిత ని అరెస్ట్ చేస్తారో చేయరో అనే సంధిగ్ధమ్ ని కొనసాగిస్తున్నది బీజేపీ! ఇది నితీష్ మీద బాగా పనిచేసింది ఇంకా పనిచేస్తున్నది!
నిజానికి కెసిఆర్ ని కలుపుకుంటే నితీష్ లాభ పడతాడు. కెసిఆర్ ప్రతిపక్ష కూటమికి నిధులు ఇవ్వగల స్టేజ్ లో ఉన్నాడు. అంతో కొంత తన అధికారాన్ని ఉపయోగించి సహకరించ గలడు.కానీ నితీష్ కెసిఆర్ ని నమ్మకుండా చేయడంలో సఫలం అయ్యింది బీజేపీ.కెసిఆర్ ని ఒంటరి వాడిని చేయడంలో 110% సఫలం అయ్యింది.మరో వైపు శరద్ పవార్ చేత పాట్నా ప్రతిపక్ష సమవేశమ్ మీద నీళ్ల్లు చల్లించగలిగింది బీజేపీ.బహుశా ఈ పాటికే నితీష్ కి అర్ధం అయి ఉంటుంది తనతో ఉన్న వాళ్ళలో బీజేపీ కోవర్టులు ఎవరో కానీ బయట పడలేడు..
మెడలు వంచడం, చక్రాలు తిప్పడం అంటే ఇదీ అని మన తెగులు మీడియా ఎప్పుడు తెలుసుకుంటుంది?
జైహింద్! జై భారత్!