Jampala Praveen: కథా రచయిత, సీనియర్ జర్నలిస్ట్ వుప్పల నరసింహం అంత్యక్రియలు నిరాడంబరంగా జరిగాయి. జర్నలిస్టుగా, సాహితివేత్తగా రాణించిన నరసింహంకు వీడ్కోలు పలికేందుకు అభిమానులు, శ్రేయోభిలాషులు, సాహితివేత్తలు భారీగా అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆయన మృతితో సాహితీలోకానికి తీరని లోటని పలువురు రచయితలు అభిప్రాయపడ్డారు. రచయితగా, జర్నలిస్టుగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. నరసింహం మొదటగా ఆంధ్రప్రభ దినపత్రికలో సంపాదకులుగా పనిచేశారు.సబండ వర్ణాల సారసత్వం,వాదం, మట్టి మనిషి కథలు,నిజం, మావోయిస్టుల రక్త చరిత్ర, అద్దంలో బౌద్ధం, హళ్ళికి హళ్ళి,రాగం, భావం, క్లేశవుడు,ఊసరవెల్లి,జంగల్ నామాపై జనం ప్రజా ప్రశ్న,ఈ ఆధునిక అద్వైతంపై ఓ చెవి పెడతారా అనేక పుస్తకాలను ప్రచురణ చేశారు.
2019 తెలంగాణ సాహిత్య అకాడమీ తరపున మట్టి మనిషి కథ సంపుటికి ఉత్తమ వచన రచన పురస్కారం,2017లో తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ కీర్తి పురస్కారం, 2020 సాహిత్య సమితి ధార్మిక సాహిత్య పురస్కారం నరసింహం అందుకున్నారు. అంతక్రియాల కార్యక్రమం హైద్రాబాద్ లోని గోల్నాకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మధ్య నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో మా భుమీ నటులు బి.యన్ యాదగిరి, రచయిత ఆడెపు లక్ష్మిపతి,ప్రముఖ రచయిత రాపోలు సుదర్శన్ , సూర్య పత్రిక పొలిటికల్ కార్టునిస్ట్ నారు, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు జంపాల రమేష్ వివిధ సంఘాల నాయకులు, సాహితివేత్తలు, ప్రజా సంఘల వారు హాజరై నివాళులర్పించారు.