Rammandir : 500 ఏళ్ల స్వప్నం సాకారంకాబోతోంది.!

AyodhyaRammandir:

 500 వందల ఏళ్ల స్వప్నం..

వేల మంది త్యాగం..

కోట్లాది మంది చిరకాల వాంఛ..

సాకారమయ్యే శుభ తరుణం రానే వచ్చింది. మరి కొద్ది గడియల్లో హిందువుల ఆరాధ్య దైవం అయోధ్య  శ్రీరాముడికి  ప్రాణ ప్రతిష్ట  జరగబోతోంది. అతిరథ మహారథులు సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగే బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు నిర్వాహకులు భారీగా  ఏర్పాట్లు చేశారు.ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా దేశం నలుమూలలనుంచి వచ్చిన పాధువులు, పండితులతో పాటుగా వివిధ రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇందుకోసం శ్రీరాముడి జన్మస్థలిగా భావించే అయోధ్యను అధికారులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఎక్కడ చూసినా ఆధ్మాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. దేశంలోని వివిధ ఆలయాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట సమయంలో ముగియనుంది.

కాగా ఈ బృహత్తర కార్యక్రమం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దేశ విదేశాలనుంచి వచ్చిన 7 వేల  మందికి పైగా ప్రముఖులనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పటికే  బిజెపి పాలిత రాష్ట్రాలు, ఒడిశా రాష్ట్రప్రభుత్వం సోమవారం హాలిడే ప్రకటించడంతో లక్షలాది మంది టీవీ, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.

 మరోవైపు  వాషింగ్టన్ డిసి మొదలుకొని పారిస్, సిడ్నీ సహా దాదాపు అరవై దేశాల్లో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విశ్వ హిందూ పరిషత్ విహెచ్‌పి,ఆయా దేశాల్లోని హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాముడి   ప్రాణప్రతిష్ఠ కోసం ‘యజమానులు’గా దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి 14 జంటలను ఎంపిక చేశారు. ఈ నెల 16న ప్రారంభమైన ప్రాణప్రతిష్ఠకు ముందు చేపట్టాల్సిన క్రతువులు సోమవారం ముగుస్త్తాయని ఆలయ ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ తెలియ జేశారు.

 మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల రామ్‌లల్లా విగ్రహాన్ని గురువారం ఆలయ గర్భగుడిలో ఉంచడం జరిగింది. వస్త్రంతో కళ్లు కప్పి ఉంచిన కొత్త విగ్రహం తొలి ఇమేజిని శుక్రవారం విడుదల చేశారు. తూర్పునుంచి ప్రవేశం
ఆలయంలోకి ప్రవేశం తూర్పువైపునుంచి, నిష్క్రమణ దక్షిణం వైపునుంచి ఉంటాయని చం పత్ రాయ్ చెప్పారు. ప్రధాన ఆలయం మూడంతస్థుల్లో జి+2,ఉంటుంది. భక్తులు ఆలయంలోకి చేరుకోవడానికి తూర్పువైపునుంచి 32 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

సంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన ఆలయం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎ త్తు ఉంటుంది. ప్రతి అంతస్థు 20 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నా యి.పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

 

Optimized by Optimole