ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద ఐశ్వర్యం ఏమిటి అని అడిగితే అనుభవజ్ఞులు చెప్పేది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటే చాలు అన్ని ఉన్నట్లే. కాబట్టి ప్రతీ ఒక్కరు కోరుకునేది జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉంటే చాలు. అయితే మన సనాతనధర్మం ఎన్నో రహస్యాలను మంత్రాల రూపంలో, నమ్మకాలతో ఆయా క్రియలలో, నిత్యకృత్యాలలో నిక్షిప్తం చేసి మనకు అందించారు. కానీ మనం వాటిలో ఎక్కువ భాగం నిర్లక్ష్యం చేసి అనేక బాధలు పడుతున్నాం. అయితే ఆరోగ్యంగా ఉండటానికి పెద్దలు చెప్పిన వాటిలో ప్రధానంగా ఖర్చులేనిది, తేలికగా చేయగలిగేది ప్రాతఃకాలంలో లేవడం, కాలకృత్యాలు తీర్చుకుని సూర్యనమస్కారాలు చేయడం, సూర్య ఆరాధన చేయడం ప్రదానమైనవి. అయితే వాటని కేవలం భౌతికంగానే కాక మానసికంగా కూడా చేస్తే ఫలితం మరింత పుణ్యప్రదం, శక్తివంతం అని సూర్యోపాసకులు పేర్కొంటున్నారు. అలాంటి వాటిలో అద్భుతమైన అష్టకం సూర్యాష్టకం. 1. ఆదిదేవ ! నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర | దివాకర ! నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే అర్థము : ఆదిదేవుడైన సూర్యభగవానునికి నమస్కారము, ఉదయభనుడు నన్ను కరుణించుగాక. దినాధిపతికి నమస్కారం. ప్రకాశ స్వరూపునకు నమస్కారం. 2. సప్తాశ్వరథ మారూఢం – ప్రచండం కశ్యపాత్మజం | శ్వేతపద్మధరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్ అర్థము : ఏడు గుఱ్ఱములు గల రథమునందు పయనించువాడు అద్భుతంగా ప్రకాశించువాడు, కశ్యపునికుమారుడుతెల్లనిపద్మమునుధరించినవాడగుసూర్యభగవానునకుప్రణమిల్లుచున్నాను.!!