బీఆర్ఎస్ నేతలకు ఇదో కనువిప్పు లాంటి కథ..

కిరణ్ రెడ్డి వరకాంతం (ఐన్యూస్ జర్నలిస్ట్): 

అధికార పార్టీ అభ్యర్థులపై నెగిటివ్ టాక్ కు అసలు కారణమేంటి ?అభివృద్ధి చేసినా సానుభూతి ఎందుకు లేదు ?వారి ఎదురీతలో ఆంతర్యమేంటి ?తిన్నొడే తన్నాడా ?

నిజంగా నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి.పొగిడితే తప్పా నిజం చెబితే ఎవరూ నమ్మరు.ఈ కథంతా ఎందుకు చెబుతున్నా అంటే…అసెంబ్లీ ఎన్నికల పోరు హోరా హోరీగా సాగుతుంది.ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా….ఇది గెలిచే సీట్ అని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు.సర్వే సంస్థలు కూడా ప్రజల నాడి పసిగట్టలేక పోతున్నాయి.వాస్తవానికి ప్రజలు ప్రభుత్వం పై వ్యతిరేకత తో ఉన్నారా ? లేదంటే అభ్యర్థిపై ఉన్నారా ?అసలు మార్పు కోరుకుంటున్నారా ? అన్న నిర్దారణకు రాలేక పోతున్నాయి.గ్రౌండ్ రియాల్టీ చూస్తే మాత్రం సీన్ మరోలా ఉంది.ప్రభుత్వం పై వ్యతిరేకత కంటే అభ్యర్థుల మీదే నెగిటివ్ గా ఉన్నారు జనం.మరీ ముఖ్యంగా అభ్యర్ధుల కంటే వారి కింద గల సెకండ్ కేడర్ లీడర్ల పైనే మరింత సంతృప్తి తో ఉన్నారనేది జీర్ణించుకోలేని నిజం.దానికి గల ఆధారాలు కూడా ఉన్నాయి.మొదటి అంశం దళిత బందు,బీసీ బందు,గృహలక్ష్మి లాంటి సంక్షేమ పథకాలు అభ్యర్ధులకు సంక్షోభాన్ని మిగిల్చాయి.ఎందుకంటే రైతు బందు,రైతు భీమా,ఆసరా పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలకు పైరవీలు అవసరం లేదు. అర్హులందరికీ వారి ఖాతాలోనే నగదు జమ అవుతుంది.ఇది నిరంతర ప్రక్రియ.కానీ ప్రయోగాత్మకంగా తెచ్చిన దళిత బందు, బీసీ బందు లాంటి పథకాలు అదికార పార్టీ అభ్యర్ధుల కొంప ముంచుతున్నాయి.పథకాల పైరవీలు బిగ్ డ్యామేజ్ చేసేసాయి.

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణ లేదు..

కొత్తగా తెచ్చిన బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు మొత్తం వాళ్ళ అనుచరులు,కార్యకర్తలకు మాత్రమే దక్కాయనేది అంతా ఒప్పుకోవాల్సిన నిజం. సామాన్యుడు లబ్ధి పొందాలంటే ఎంతో కొంత అదికార పార్టీ లీడర్ల చేయి తడపాల్సిన పరిస్థితి.కొన్ని చోట్ల అయితే అంతా ఓపెన్.దళిత బందు పథకాన్ని బహిరంగం గానే వేలం వేశారు సెకండ్ కేడర్ లీడర్లు.ఫైనల్ గా బీఆర్ఎస్ సంక్షేమ పథకాల వల్ల సామాన్యుడికి ఒరిగింది ఏమి లేదు.వారి పార్టీ కార్యకర్తలు మాత్రం లబ్దిపొందారన్నది ఓపెన్ సీక్రెట్.ఇక బోతే అదికార పార్టీ అండ తో భూ కబ్జాలు,బెదిరింపు వసూళ్లు,ల్యాండ్ సెటిల్ మెంట్లు,కాంట్రాక్టుల్లో కమీషన్ లు, ఆఖరికి బార్యా భర్తల పంచాయితీలు,ఇల్లీగల్ ఎఫైర్ గొడవలు కూడా పార్టీ నేతలే తెంపాల్సిన దుస్థితి.అంటే అధికారం ఉన్నన్నాల్లు వారి దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లింది.తమ ఎమ్మెల్యే పుణ్యమాని ఆర్దికంగా లబ్ధి పొందారు ద్వితీయ శ్రేణి నేతలు.ఇగ ఇంకేం ఎన్నికల సమయం వచ్చింది.ఇన్నాళ్లు పార్టీ లీడర్లే లబ్ధి పొందారు.ఇప్పుడు తిన్నోల్లే తిడుతున్నారు.అభ్యర్ధులకు రివర్స్ అయ్యారు.బిగ్ హ్యాండ్ ఇచ్చేశారు.అవతలి పార్టీలో దూరిపోతున్నారు.కొందరైతే డబ్బులు ఇవ్వకుంటే ప్రచారానికి కూడా రావడం లేదు.చేసేదేమీ లేకా సెకండ్ కేడర్ లీడర్ లకు లక్షలకు లక్షలు తగలేసి వెంట తిప్పుకుంటున్నారు బరిలో ఉన్న అభ్యర్దులు.తినేది మొగని సొమ్ము పాడేది ఇంకెవరి పాటో అన్నట్టుగా…ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలు గెలిస్తే,లబ్ధి పొందేది వీళ్ళ కింద ఉండే లీడర్లు.ఐదేళ్లు ప్రజలేమో బానిసలుగా బతుకుతారు.లీడర్లు ఆస్తులు పెంచుకుంటారు.ఐదేళ్లు ప్రజల జుట్టు పట్టుకుంటారు.ఎన్నికల సమయానికి కాళ్ళు పట్టుకుంటారు.తిన్నొడు తంతుంటే తెలుస్తుంది పెద్ద లీడర్లకు.మనోడు ఎవడో మందోడు ఎవడో అని. అందుకే మళ్ళీ చెబుతున్నా.నిజాలు చేదు భజన ముద్దు. ప్రజలను నమ్ముకుని,వాళ్ళ బాగోగులు పట్టించుకున్న వాడు లీడర్ అవుతాడు.చెప్పుడు మాటలు విని,ప్రజలను, పాలనను గాలికి వదిలేసినోడు కాల గర్భంలో కలిసి పోతాడు.అందుకే అంటారు నాయకుడు ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని.ఇప్పటికైనా నా కథ నేతలకు కనువిప్పు కావాలని కోరుకుంటూ.

(నోట్ : ఇది ఒక్కర్ని ఉద్దేశించి రాసింది అస్సలు కాదు.రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో దాదాపు ఇదే పరిస్థితి)