హిందు పురాణాల ప్రకారం తులసి వివాహం చాలా ప్రాముఖ్యమైనది. పవిత్రమైన ఈ పండుగను హిందువులు ప్రతి ఏటా కార్తీక మాసంలో శుక్లపక్షనాడు జరుపుకుంటారు. భక్తులందరూ తులసి చెట్టుకు వివాహం జరిపిస్తారు. మరి ఇంతకీ తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు? ఎవరితో వివాహం జరిపిస్తారు? ఎందుకు ఈ పండుగను జరుపుకుంటారో తెలుసుకుందాం..!
పురాణ కథ:
హిందూ పురాణాల ప్రకారం తులసిదేవుని వృందగా పిలుస్తారు. ఈమె మహావిష్ణువుకు మహాభక్తురాలు.
కాలనేమి రాక్షసుడికి అందమైన కూతురైన ఈ యువరాణి.. జలంధర్ అనే రాక్షసుడుని వివాహం చేసుకుంటుంది. పరమ శివుడి ఆగ్రహానికి గురై అగ్నిలో నుండి పుట్టడం వల్ల జలంధరుడికి అపారమైన శక్తులు ఉంటాయి. ఇతను దేవుళ్ళను ద్వేషిస్తుంటాడు. అయితే దేవుళ్ళను అమితంగా ఆరాధించే వృందను ప్రేమిస్తుంటాడు. పెళ్లి తర్వాత యువరాణి భక్తి , పవిత్రత వల్ల జలంధరుడికి శక్తి అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది.ఎంతలా అంటే సమస్త విశ్వానికి అధిపతి అయిన ఈశ్వరుడు కూడా జలంధరుడుని ఓడించలేనంత. దీంతో సమస్త విశ్వానికి అధిపతి కావాలని జలంధరుడు కలలుగంటాడు. దీంతో దేవుళ్ళందరూ విష్ణుమూర్తి సహాయం కోరుతారు. అయితే వృంద తన భక్తురాలు కావడంతో సందిగ్ధంలో పడతాడు.
జలంధరుని రూపంలో మహావిష్ణువు…
పరమశివునితో జలంధరు యుద్ధంలో ఉండగా.. వృంద వద్దకు మహావిష్ణువు జలంధ రూపంలో వస్తాడు. అయితే ఆమెను అతను తాకగానే జలందర్ కాదని భావిస్తుంది. వెంటనే నిజరూపాన్ని కోరుతుంది. మహావిష్ణు ప్రత్యక్షమవడంతో తాను పూజించే దేవుడే తనను మోసం చేశాడని ఆగ్రహంతో రగిలిపోతుంది. మహావిష్ణువుని రాయిలా మారిపోమని శపిస్తుంది. ఆమె శాపాన్ని అంగీకరించి విష్ణువు గండగ నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు. మరోవైపు యుద్ధంలో జలంధరుడు పరమశివుడు చేతిలో మరణిస్తాడు. దీంతో వృంద కూడా తన జీవితాన్ని ముగించాలని భావిస్తుంది.
లక్ష్మీదేవి విజ్ఞప్తి..
లక్ష్మీదేవి.. జలందరుడి భార్య వృందను శాపాన్ని వెనక్కి తీసుకోమని కోరుతుంది. అప్పుడు ఆమె తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది.అయితే విష్ణువు సాలిగ్రామ రూపాన్ని వివాహం చేసుకున్న తర్వాతే ఈశాపం అంతమవుతుందని లక్ష్మీదేవికి చెబుతుంది. ఈ తంతగం తర్వాత ఆమె సతీగా మారుతుంది. ఆమె బూడిద నుంచే తులసి మొక్క పుట్టిందని పురణాలు చెబుతున్నాయి.
తులసి పూజ విధానం..
తులసి మొక్కను తీసుకొని మండపంలా ఏర్పాటు చేయాలి. మండపం చుట్టూ ఎర్రటి చీరతో కట్టాలి. ఆ తర్వాత తులసి మొక్కను గాజులతో అలంకరించాలి.
తులసితి చెట్టు దగ్గర కొబ్బరికాయ చక్కెర బొమ్మలు ఐదు రకాల పండ్లను ఉంచాలి. అనంతరం హారతి ఇచ్చి తులసి, లార్డ్ సాలిగ్రామ్ ను జపిస్తూ ప్రార్థించండి
పండుగ ప్రాముఖ్యత:
పెళ్ళికాని యువకులు ఈ పూజను జరిపిస్తే పరిష్కారం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని భక్తుల నమ్మకం. అంతేకాక కార్తీక మాసంలో ఉసిరి తులసి పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని విశ్వాసం.